Divya Bharti: 32 సంవత్సరాలుగా వీడని మిస్టరీ.. 18 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసిన హీరోయిన్.. దివ్య భారతి చనిపోయే ముందురోజు రాత్రి జరిగింది అదే..

భారతీయ సినీప్రియుల హృదయాల్లో చెక్కు చెదరని రూపం దివ్య భారతి. 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఒక్క ఏడాదిలోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వరుస అవకాశాలతో తనదైన ముద్ర వేసింది. కానీ 19 ఏళ్ల వయసులోనే ఊహించని విధంగా మరణించింది. కానీ ఇప్పటికీ ఆమె మృతిపై ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతుంటాయి.

Divya Bharti: 32 సంవత్సరాలుగా వీడని మిస్టరీ.. 18 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసిన హీరోయిన్.. దివ్య భారతి చనిపోయే ముందురోజు రాత్రి జరిగింది అదే..
Divya Bharti

Updated on: Dec 25, 2025 | 9:19 AM

సినీరంగంలో చిన్న వయసులోనే తనదైన ముద్ర వేసిన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. కేవలం 16 ఏళ్ల వయసులోనే యూత్ హృదయాలు కొల్లగొట్టిన హీరోయిన్ ఆమె. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఏడాదిలోనే సినీరంగంలో చక్రం తిప్పిన ఏకైక హీరోయిన్. ఒకప్పుడు అందమైన రూపం.. సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న ఆమె.. ఊహించని విధంగా 19 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. వెంకటేశ్ సరసన బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దివ్య భారతి.. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

ఆ తర్వాత విశ్వాత్మ సినిమాతో హిందీ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడే అర్థాంతరంగా తనువు చాలించింది. 18 ఏళ్ల వయసులో ఒక్క ఏడాదిలోనే దాదాపు 12కి పైగా సినిమాలకు సంతకం చేసిందంటే.. అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలాను రహస్యంగా పెళ్లి చేసుకుంది దివ్య భారతి. ఏప్రిల్ 5న రాత్రి దివ్య భారతి.. వెర్సోవా ఇంట్లో డిజైనర్ నీతా లుల్లా, ఆమె భర్తతో కలిసి ఉంది. తమతో మాట్లాడుతూ దివ్య కిటికి వైపు నడిచిందని.. అప్పుడు అ అపార్ట్‌మెంట్‌లో సేఫ్టీ గ్రిల్స్ లేవని.. కిటికీ అంచున కూర్చోవడానికి ప్రయత్నించడంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి ఐదవ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని సమాచారం.

ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు ప్రకటించారు. ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. అప్పట్లో దివ్య మరణంపై అనేక వార్తలు వినిపించాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. ? లేదా హత్య చేశారా.. ? అనే ప్రచారం కూడా నడిచింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె రక్తంలో అధిక స్థాయిలో ఆల్కహాల్ ఉందని తేలింది. 1998లో ముంబై పోలీసులు ఈ కేసును అధికారికంగా ఆధారాలు లేకపోవడంతో ముగించారు. కానీ ఇప్పటికీ దివ్య భారతి మరణంపై ఏదోక రూమర్ నడుస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..