AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Mohini: బాలకృష్ణ ‘ఆదిత్య 369’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా ?.. విదేశాల్లో ఏం చేస్తున్నారంటే..

ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ సినీపరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. టాప్ హీరోయిన్స్ అవుతారనుకున్న తారలు అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, భర్త, పిల్లలతో ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందులో మహాలక్ష్మి శ్రీనివాసన్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. హీరోయిన్ మోహిని అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కథానాయికగా తెరంగేట్రం చేసిన తర్వాత తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు. 90లలో ఆమె అగ్ర కథానాయిక.

Actress Mohini: బాలకృష్ణ 'ఆదిత్య 369' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా ?.. విదేశాల్లో ఏం చేస్తున్నారంటే..
Actress Mohini
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2023 | 1:15 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ఓ వెలుగు వెలిగారు. తమ అద్భుతమైన నటనతో అడియన్స్ మనసులలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ సినీపరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. టాప్ హీరోయిన్స్ అవుతారనుకున్న తారలు అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, భర్త, పిల్లలతో ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందులో మహాలక్ష్మి శ్రీనివాసన్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. హీరోయిన్ మోహిని అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కథానాయికగా తెరంగేట్రం చేసిన తర్వాత తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు. 90లలో ఆమె అగ్ర కథానాయిక.

తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు. మిళనాడులోని తంజావూరులో జన్మించి.. చెన్నైలోని చిల్డ్రన్స్ గార్డెన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత 1991లో ఈరమన రోజావే సినిమాతో కథానాయికగా కనిపించింది. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాత కెయార్. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హిందీలో అభి అభి పేరుతో 1992లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో మోహిని వెనుదిరిగి చూసుకోలేదు.

Mohini

Mohini

నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డిటెక్టివ్ నారధ, మామ బాగున్నావ్, హిట్లర్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా ఉన్న మోహినికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టిన సమయంలోనే ఆమె భరత్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్ని కారణాలతో భర్తకు విడాకులు ఇచ్చింది మోహిని. ప్రస్తుతం ఆమె అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?