Parugu Movie: అయ్యా బాబోయ్.. ‘పరుగు’ మూవీ హీరోయిన్ ఈ రేంజ్లో మారిపోయిందేంటీ.. ఇప్పుడు చూస్తే షాకే..
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఆ తండ్రి పడే వేదనను ఈ చిత్రంలో ఎంతో చక్కగా చూపించారు డైరెక్టర్ భాస్కర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషన్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో షీలా ఒకరు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగు అడియన్స్కు అంతగా గుర్తుండదు. ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒకటి రెండు చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఏంటీ షీలా అంటే గుర్తుకురావడం లేదా.. ? తనే అల్లు అర్జున్ నటించిన పరుగు మూవీ హీరోయిన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పరుగు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఆ తండ్రి పడే వేదనను ఈ చిత్రంలో ఎంతో చక్కగా చూపించారు డైరెక్టర్ భాస్కర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషన్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, జయసూధ, పూనమ్ బజ్వా కీలకపాత్రలు పోషించారు. 2008లో విడుదలైన ఈ సినిమాకు అల్లు అర్జున్ నంది అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది షీలా. ఈ ముద్దుగుమ్మ.. నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత పరుగు, మస్కా, అదుర్స్ చిత్రంలో నటించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో కనిపించిన షీలా.. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. 2020లో సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్న షీలా.. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న షీలా.. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా షీలా లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికీ షీలా చాలా మారిపోయిందని.. ఎంతో అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
