
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందంలోనూ అప్సరసే.. ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు.
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాని రాజశేఖర్. ఈ ముద్దుగుమ్మ 2స్టేట్స్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత తిరిగి తెలుగులో సినిమాలు చేసింది.
2021లో వచ్చిన అద్భుతం అనే సినిమాలో నటించి మెప్పించింది. తేజ సజ్జ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సినిమా చేసింది కానీ ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే మరోసారి తమిళ్ లో నెంజుక్కు నీతి అనే సినిమా చేసింది. ఆతర్వాత వరుసగా ‘శేఖర్’, కోట బొమ్మాళి పీ.ఎస్, విద్య వాసుల అహం అనే సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. దాంతో ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామ తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి