ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సహాయక పాత్రలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే ఎంతో మంది హీరోల నుంచి సహాయక పాత్రలోకి కూడా మారారు. అదేవిధంగా కొందరు ఎన్నో కష్టాలు చూసి ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డారు. వారిలో ఈ నటుడు ఒకరు.

ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..
Tollywood

Updated on: Jan 23, 2026 | 8:35 PM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఎంతో మంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వారిలో ఈ నటుడు ఒకరు. ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నటుడు ఆయన. మిమిక్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 22 ఏళ్లకే హీరోగా మారి సినిమాలు చేశారు. నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన.. అలాగే పద్మశీ అవార్డు కూడా అందుకున్నాడు. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు.. హీరోగా చేసిన ఆయన ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు..

మలయాళ నటుడు జయరామ్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తి పేరు జయరామ్ సుబ్రమణ్యం.. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు జయరామ్. అలాగే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. మలయాళ సినిమాలతో పాటు తమిళ్, తెలుగు సినిమాల్లోనూ నటించారు జయరాం. ఇక తెలుగులో భాగమతి, అల వైకుంఠపురములో, రాధే శ్యామ్, హయ్ నాన్న, ధమాకా, రావణాసురుడు, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.

జయరామ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. మిమిక్రీ కళాకారుడు, గాయకుడు కూడా. ఆయన 2011లో పద్మశ్రీ పురస్కారం, రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా పలు అవార్డులను అందుకున్నాడు. హీరోగా రాణించిన సమయంలోనే కొన్ని ఫ్లాప్స్ రావడంతో ఆయన కెరీర్ డల్ అయ్యింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నింటికన్నా బాధేంటో తెలుసా? సక్సెస్‌ అయినప్పుడు అందరూ పొగుడుతారు. కానీ కెరీర్‌ ఒడిదుడుకులకు గురైనప్పుడు చిన్నచిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు, ఏదో ఒక రకంగా నిందిస్తారు, దూరం పెడతారు. అది చాలా బాధేస్తుంది అని అన్నారు జయరామ్. కెరీర్ బిగినింగ్ లో వరుసగా సినిమాలు చేశా.. కానీ వెంటనే రెండు మూడు ఫ్లాప్స్ పడేవి.. వాటిని ఏడుకోవడం చాలా కష్టంగా ఉండేది. గత 38 ఏళ్లుగా ఇదే జరుగుతోంది అని తెలిపారు జయరామ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..