అప్పుడు చరణ్ క్లాస్‌మేట్.. కట్ చేస్తే ఇప్పుడు తల్లిగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అప్పుడు చరణ్ క్లాస్‌మేట్.. కట్ చేస్తే ఇప్పుడు తల్లిగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Ram Charan

Updated on: Mar 03, 2026 | 8:59 PM

టాలీవుడ్‌లో స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరోలు అవుతారనే గ్యారెంటీ ఉండదు. సినిమా పరిశ్రమలో ప్రతిభ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే.. సరైన ప్రతిభ లేకపోతే ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం దక్కకపోవచ్చు. అయితే, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగానే ఎదిగారు. ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తాను చాటుకున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు చరణ్.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే, రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన క్లాస్‌మేట్ అయిన ఒక హీరోయిన్ ఆయనకు ఒక సినిమాలో తల్లిగా నటించారని మీకు తెలుసా.? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఆ హీరోయిన్ మరెవరూ కాదు, టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రియా శరన్. స్టార్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ శ్రియా శరన్ ఇద్దరూ నటనకు సంబంధించి ఒకేచోట శిక్షణ తీసుకున్నారు. ఈ విధంగా వారు క్లాస్‌మేట్స్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రకు శ్రియ తల్లిగా నటించింది.  శ్రియ చరణ్ కంటే మూడేళ్లు పెద్దది కావడం గమనార్హం. శ్రియ చరణ్ కంటే చాలా సంవత్సరాల ముందే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, సీనియర్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. మెగా హీరోలతో శ్రియ నటించిన మెజారిటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి. శ్రియ సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ, యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రియ రామ్ చరణ్ క్లాస్‌మేట్ అయి ఉండి, ఆయన చిన్ననాటి పాత్రకు తల్లిగా నటించడం సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన విషయంగా మారింది.

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us