
సోషల్ మీడియా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. డబ్ స్మాష్, టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా కొంతమంది పాపులర్ అయ్యారు. అలాగే మరికొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మన దగ్గర ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా, కమెడియన్స్ గా రాణిస్తున్నారు. చాందిని చౌదరి, వైష్ణవి చైతన్య, సుహాస్, రమ్య పసుపులేటి రీసెంట్ గా మౌళి ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారే.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా డబ్ స్మాష్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు మృణాళిని రవి.. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది మృణాళిని రవి. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో పరిచయం అయ్యింది. గద్దల కొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది మృణాళిని రవి. ఈ అమ్మడు 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ సినిమా ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. మొదట్లో మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది.
ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. అలా హీరోయిన్ గా మారింది మృణాళిని రవి. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తమిళ్ తెలుగు భాషల్లో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇక తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మాయ మశ్చేంద్ర, లవ్ గురు సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ లో విశాల్ ఎనిమి, విక్రమ్ కోబ్రా లాంటి క్రేజీ సినిమాల్లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.