వెంకటేష్‌కు లవర్‌గా.. చిరంజీవికి అక్కగా నటించిన ఈహీరోయిన్ ఎవరో తెలుసా.?

వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు, వెంకీ కలిసి నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెంకీ మామ, మెగాస్టార్ కలిసి ఓ మాస్ సాంగ్ కు స్టెప్పులు కూడా వేయనున్నారు .

వెంకటేష్‌కు లవర్‌గా.. చిరంజీవికి అక్కగా నటించిన ఈహీరోయిన్ ఎవరో తెలుసా.?
Actress

Updated on: Dec 04, 2025 | 7:27 PM

విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ గెస్ట్ గా కనిపించనున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కలిసి ఓ మాస్ సాంగ్ కు స్టెప్పులేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఇప్పుడు వెంకటేష్  ఓల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న ఫోటో ఒకటి న నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకు పై ఫొటోలో వెంకటేష్ తో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా.? తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఆమె. ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ ఆమె. వెంకటేష్ కు లవర్ గా నటించిన ఆమె.. మెగాస్టార్ చిరంజీవికి అక్కగా నటించారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

కాగా పై ఫొటోలో వెంకటేష్ తో ఉన్న సూపర్ హాట్ బ్యూటీ ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. వెంకటేష్ ఖుష్బూ కలిసి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. వెంకటేష్ తొలి సినిమా కలియుగపాండవులు సినిమాలో ఖుష్బూ హీరోయిన్ గా చేశారు. కలియుగపాండవులు సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ అనే చెప్పాలి ఆతర్వాత ఖుష్బూ హీరోయిన్ గా బిజీ అయ్యింది. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చిరు అక్కగా నటించింది. ఇక ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే రాజకీయాల్లోనూ ఖుష్బూ రాణిస్తున్నారు. నటుడు, దర్శకుడు కూడా సుందర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .