సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ తమ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో మంది నటీ నటులు అడుగుపెడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చాలా మంది హీరోయిన్స్ గా, హీరోలుగా సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ గా మంచి పొజిషన్ అందుకున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అయ్యి ఆతర్వాత అవకాశాలు అందుకోలేకపోయారు. ఇప్పుడు మనం ఆ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటున్నానం. ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వడమే స్టార్ హీరో సినిమాతో పరిచయం అయ్యింది. కానీ ఒకే ఒక్క సినిమాతో ఆకట్టుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు..
బాలీవుడ్ లో ఎంతో మంది అందాల భామలు తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. వారిలో ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన ముద్దుగుమ్మ గాయత్రీ జోషి. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా హిందీ సినిమా రంగంలో పనిచేసింది. 1977 ఏప్రిల్ 20న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించింది ఈ బ్యూటీ. గాయత్రీ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది . ఆతర్వాత పలు ప్రకటనలలో కనిపించింది. ఆమె 1999లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్ ఇంటర్నేషనల్ 1999 పోటీలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించింది.
సినిమా రంగంలో మొదటి సినిమానే “స్వదేశ్” తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన గీత పాత్రలో నటించింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే, “స్వదేశ్” తర్వాత ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. 2005లో ఆమె వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది. దాంతో సినీ రంగం నుంచి దూరమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆస్తిపాస్తులు మాములుగా లేవు. గాయత్రీ జోషి దాదాపు రూ.44,250 కోట్లకు మహారాణి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.