ఇండస్ట్రీలోకి వచ్చి 9ఏళ్లు.. ఒకే ఒక్క హిట్.. ఆస్తిపాస్తులు మాత్రం వందలకోట్లు

వరుసగా సినిమాలు, చేసినవన్నీ బడా హీరోల సినిమాలే కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ చిన్నది దాదాపు 9 ఏళ్ళుఅవుతుంది. కానీ ఒకే ఒక్క హిట్ అందుకుంది. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా అయ్యాయి. ఇక టాలీవుడ్ లో ఇటీవలే భారీ హిట్ అందుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చి 9ఏళ్లు.. ఒకే ఒక్క హిట్.. ఆస్తిపాస్తులు మాత్రం వందలకోట్లు
Actress

Updated on: Feb 24, 2025 | 8:52 AM

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా  సహజం .. సక్సెస్ వచ్చినప్పుడు రెచ్చి పోయి.. డిజాస్టర్స్ వచ్చినప్పుడు కుంగి పోకుండా చాలా మంది నటీనటులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమ టాలెంట్ ను నమ్ముకొని చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఇండస్ట్రీలోకి ఈ అమ్మడు అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతుంది. కానీ ఒకే ఒక్క హిట్ అందుకుంది. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బడా హీరోల సినిమాలే.. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తెలుగులో రీసెంట్ గానే భారీ హిట్ అందుకుంది. ఇంతకూ  ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

ఇండస్ట్రీలో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ బడా సినిమాలే, కమర్షియల్ మూవీ మాత్రమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది ఈ వయ్యారి. నటనలోనే కాదు అందంలోనూ అప్సరస ఈ చిన్నది. కానీ అదృష్టం మాత్రం ఎక్కువగా కలిసి రాలేదు. 9ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఆమె ఎవరో కాదు.  బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!

వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా హిట్స్ దక్కలేదు. ఇక ఇటీవలే తెలుగులోకి అడుగుపెట్టింది. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. కాగా జాన్వీ వయసు ఇప్పుడు 27 ఏళ్ళు కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది.

ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

జాన్వీ కపూర్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.