అమ్మో.. ఈ హీరోయిన్ మామూల్ది కాదుగా..! సినిమా కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది..

సినీరంగుల ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే గ్లామర్ కాదు.. ప్రాధాన్యత ఉన్న పాత్ర, కంటెంట్ ముఖ్యం అంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె నటించిన ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

అమ్మో.. ఈ హీరోయిన్ మామూల్ది కాదుగా..! సినిమా కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది..
Actress

Updated on: Jun 03, 2025 | 8:23 PM

సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోవాలంటే సైతం అదే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న తారలు గతంలో ఎన్నో అవమానాలు చూసినవారే. అడ్డంకులను ఛేదించి తమ సత్తాను నిరూపించుకోవడం అంటే సాధారణ పని కాదు. తాజాగా ఓ హీరోయిన్ అందంగా లేదని.. లావుగా ఉందంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తీసేసారట. ఆమె వికారంగా ఉందని అవమానించారు. అయినప్పటికీ ఆమె నటించిన సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే చైన్ స్మోకర్ క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ ఏకంగా 12 కిలోలు బరువు పెరిగింది. ఆమె నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆమె మరెవరో కాదు..

బాలీవుడ్ లో హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. తాను నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ మర్చేసింది.

విద్యా బాలన్ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది. సినిమాలో చైన్ స్మోకర్‌గా ఉండాల్సి రావడంతో దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పొగతాగడం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్‌గా ఉండేదానిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. డర్జీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగడం మానలేదని.. కాకపోతే రోజుకు 3 సిగరెట్లు తాగనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.