
ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ, ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 ఆంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా తదితర హీరోయిన్లందరూ తమ కెరీర్ ప్రారంభంలో ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన వారే. ఇప్పుడీ జాబితాలోకి మరో సరికొత్త అందాల తార చేరింది. ఇన్ స్టా రీల్స్ తో బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతోనే అదరగొట్టింది. ఈ ఇన్ స్టా గ్రామ్ బ్యూటీ నటించిన మొదటి సినిమాతో ఏకంగా రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తను ఎవరో ఈ పాటికే చాలమందికి అర్థమై ఉంటుంది. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఈ కాకినాడ పిల్ల పేరు శ్రీదేవి అదేనండి కోర్టు సినిమా హీరోయిన్. ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల.ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. శ్రీదేవి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ రీల్ చూసి కోర్ట్ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట.ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే కోర్టు సినిమా తర్వాత ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.
శ్రీదేవికి కోలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా స్టోరీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.