
తెలుగు చిత్రసీమకు ఎందరో హీరోయిన్లు వచ్చారు. కొందరు వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదిస్తే.. మరికొందరు ఒకట్రెండు సినిమాలతోనే కనుమరుగయ్యారు. ఈ కోవకు చెందిన నటీమణులు చాలానే ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ గా చేసి ఆతర్వాత సీరియల్స్ లో నటించి అలరిస్తున్నారు. అందులో ఒకరు శ్రద్ధా ఆర్య. ఈమె టాలీవుడ్‌లోకి 2007లో ‘గొడవ’ సినిమాతో అరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవని చెప్పేసింది ఈ భామ. అందం, అభినయంతో ఆ సినిమా టైంలో కుర్రకారును ఊపేసింది.ఆ మూవీలో శ్రద్దా ఆర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో కేవలం మూడు చిత్రాల్లోనే నటించిన ఈమె.. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఎక్కడా కూడా శ్రద్దా ఆర్యకు తగిన గుర్తింపు రాలేదు.
వెండితెర పెద్దగా అచ్చి రాకపోయినా.. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది శ్రద్దా ఆర్య. అయితే శ్రద్దా ఆర్య ఏకంగా పదిసార్లు పెళ్లి చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అవును ఆమె పదిసార్లు పెళ్లి చేసుకుంది.
అయితే అది నిజంగా కాదు.. టీవీ ఇండస్ట్రీలో పెళ్లి సీన్లు కామన్.. అలా సీరియల్స్ లో ఏకంగా పది సార్లు పెళ్లి చేసుకుంది. రకరకాల సీరియల్స్ లో ఆమె ఏకంగా పది పెళ్లి సీన్స్ లో నటించింది. స్క్రీన్ మీద పదే పదే వధువుగా కనిపించి ఆమె ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే నటికి ఇన్ని సార్లు వధువు పాత్ర రావడం చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కాగా, న్యూఢిల్లీకి చెందిన ఈ భామ 2021 నవంబర్‌లో రాహుల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ.. హిందీ బుల్లితెరపై పలు అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.