
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారలు అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన గుర్తుండిపోయే సినిమాలు చేసి ఆకట్టుకుంటారు.. ఆ తర్వాత చాలా కాలం కనిపించకుండా సడన్ గా ఎదో ఫంక్షన్ లోనో లేక సోషల్ మీడియాలోనో దర్శనమిస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోతారు ఆ భామలు. అలా వచ్చిన వారిలో ఈ అమ్మడుకు కూడా ఒకరు. చిన్న వయసులోనే కెరీర్ లో పీక్ చూసింది. కానీ ఓ హోటల్ లో పోలీసులకు చిక్కి అనుకోని వివాదల్లో చిక్కుకుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకోని విధంగా వివాదాలతో ఆమె కెరీర్ పడిపోయింది. 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకుంది. కానీ 23 ఏళ్లకే ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది.
ఆ నటి మరెవరో కాదు.. శ్వేతా బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్ చిత్రం మక్టీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఆ తర్వాత తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈ మూవీలో తనదైన నటనతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకునేలాగా వ్యభిచారం కేసులో చిక్కుకుంది. దాని నుంచి బయటకు వచ్చింది. తన తప్పులేకున్నా తనకు ఆ కేసులో ఇరికించారని తెలిపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధం నిలబడలేదు.
2018లో ఓ వ్యక్తిని రహాస్యంగా పెళ్లి చేసుకుంది శ్వేత. కానీ వీరి బంధం 9 నెలలకే ముగిసింది. 23 వయసులోనే పెళ్లి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న శ్వేత.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది ఈ చిన్నది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.