Jabardasth: అప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ .. కట్ చేస్తే జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు ఇలా

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఒకప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన ఓ నటుడు ఆతర్వాత జబర్దస్త్ కమెడియన్ అయ్యారు. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

Jabardasth: అప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ .. కట్ చేస్తే జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు ఇలా
Prabhas

Updated on: May 14, 2026 | 12:42 PM

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జనాలు జబర్దస్త్ కోసం టీవీలకు అతుక్కుపోతుంటారు అంతలా ఆకట్టుకుంది ఈ షో. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పుడు సినిమాల్లోనూ కమెడియన్స్ గా రాణిస్తున్నారు. అలాగే మరికొందరు దర్శకులుగా, ఇంకొందరు హీరోలుగా కూడా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి వెళ్లిన వారు మంది ఉన్నారు.. అలాగే కొంతమంది సినిమాల నుంచి జబర్దస్త్ లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో అదిరే అభి ఒకరు. కెరీర్ బిగినింగ్ లో కమెడియన్ గా, యాంకర్ గా రాణించాడు అదిరే అభి.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఆతర్వాత జబర్దస్త్ కామెడీ షోలో చేసి ప్రేక్షకులను మెప్పించాడు. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో, పంచ్ లతో తెగ నవ్వించాడు అదిరే అభి.. అలాగే అభి టీమ్ నుంచి ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు వారిలో హైపర్ ఆది ఒకరు. కాగా అభి గతంలో హీరో ఫ్రెండ్ పాత్రల్లోనూ నటించాడు. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేశాడు. అలాగే నవదీప్ నటించిన గౌతమ్ ఎస్ఎస్సీ నటించారు. ఇలా చాలా సినిమాల్లో నటించిన అభి.. అవకాశాలు తగ్గడం వల్లో లేక మరేదైనా కారణం ఉందొ సినిమాలు వదిలి జబర్దస్త్ కు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

జబర్దస్త్ చేస్తూనే కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి దర్శకుడిగా మారారు. ఇటీవలే రాజ్ తరుణ్ తో కలిసి చిరంజీవ అనే సినిమా చేశారు. ఇది డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలైంది. ప్రస్తుతం అభి నటుడిగా దర్శకుడిగా రాణించాలని ప్రయత్నిస్తున్నారు.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభి తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను కూడా పంచుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us