
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది. ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అరుంధతి (2009), ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు వంటివి లభించాయి. అనుష్క బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
ఈ చిత్రాలు ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి. ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి (2015), సైజ్ జీరో (2015), భాగమతి (2018) వంటివి ఉన్నాయి. ఇటీవలే ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే అనుష్కకు సంబంధించిన ఓ ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో అనుష్కతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?
ఆమె రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించింది. అయితే పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు.. ప్రభాస్ సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో కథ మారడానికి ఆ అమ్మాయే కారణం. సినిమాలో సురభి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది ఆ అమ్మాయి. ఆమె పేరు సయ్యద్ ఫర్జానా. సలార్ సినిమాతో ఫర్జానాకు మంచి క్రేజ్ వచ్చింది. అంతకు మందు ఓరి దేవుడా సినిమాతో పాటు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది ఫర్జానా. ఐపీఎల్ యాడ్‌తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఫర్జానా నటించింది. అలాగే కొన్ని స్కూల్ యాడ్స్ లో కూడా కనిపించింది. ఇక సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్ సీన్ లో ఈ అమ్మాయి హైలైట్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.