హరికృష్ణకు చెల్లిగా, ఎన్టీఆర్‌కు లవర్‌గా.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఇలా..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తారక్. ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

హరికృష్ణకు చెల్లిగా, ఎన్టీఆర్‌కు లవర్‌గా.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఇలా..
Ntr,harikrishna

Updated on: Nov 14, 2025 | 12:18 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే నటించడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ వయసులో తమకన్నా పెద్ద వారితో అలాగే వయసులో చిన్నవారితో కూడా నటించారు. అయితే కొంతమంది తండ్రి, కొడుకు, మనవాళ్ళతోనూ నటించిన వారు ఉన్నారు. ఒకే హీరోయిన్ తండ్రితో అలాగే కొడుకుతో కలిసి నటించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ హరికృష్ణకు చెల్లెలిగా, ఎన్టీఆర్ కు లవర్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫేమస్ .. స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

దివంగత నటుడు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హరికృష్ణ హీరోగానే కాదు ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేసి మెప్పించారు. ఇక ఆయన వారసుడుగా ఎన్టీఆర్ ఇండస్ట్రీని రాణిస్తున్నారు, పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు తారక్. ఇక హరికృష్ణకు చెల్లెలిగా, ఎన్టీఆర్ కు లవర్ గా నటించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించిన అంకిత జవేరి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. నటనకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఎన్టీఆర్ నటించిన సింహాద్రి  సినిమాలో అంకిత జవేరి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హరికృష్ణతో కూడా అంకిత నటించింది. హరికృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో అంకిత ఆయన చెల్లిగా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా అంకిత జవేరి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి