రెండు జెళ్ళ, అమాయకపు చూపు.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

|

Mar 14, 2025 | 9:20 PM

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వైరల్ అవుతుంటే ఉన్నాయి.

రెండు జెళ్ళ, అమాయకపు చూపు.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
Actress
Follow us on

సినిమా ఇండస్ట్రీ లక్ ఎవరికి ఎప్పుడు తగులుతుందో తెలీదు. కొందరికి ఈజీగానే అవకాశాలు లభిస్తాయి. మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్లకి ఇంకా టఫ్ ఉంటుంది. ఇక హీరోయిన్ అవకాశాలు రావడం కూడా అంత ఈజీ ఏం కాదు. అందం, అభినయంతో పాటు చాలా లక్ కూడా ఉండాలి. కొందరు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ .. తామ అలా అయినా ఎవరి దృష్టిలో పడతావేమో అని ఎదురుచూస్తుంటారు. అయితే సినిమా, సీరియల్స్‌తో పాపులర్ అవ్వడం ఒక ఎత్తు.. కేవలం ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక పర్సన్ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం ఎప్పుడైనా చూశారా..? తెలుగు చిత్రసీమలో ఇలా జరగడం అరుదు అనే చెప్పాలి. పై ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? తను అలానే పాపులర్ అయింది. తను క్రేజీ యాంకర్… గ్లామర్‌తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ మాములుగా ఉండదు. తెలుగు ప్రేక్షకులు అందరికీ తను సుపరిచితురాలే. ఏంటి ఏమైనా ఐడియా వచ్చిందా..?

అంత కష్టం ఏం కాదండీ బాబూ.. ఇక మేమే చెప్పే్తాం. తను మరెవరో కాదు..‘అరియానా గ్లోరి’. ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అరియానా పక్కా తెలుగమ్మాయ్. తెలంగాణలోని తాండూరులో జనవరి 25 1993లో జన్మించింది ఈ బ్యూటీ. ఇక అరియానా అసలు పేరు అర్చన. కాకపోతే ఆ పేరు కలిసిరాకపోవడంతో.. అరియానాగా మార్చుకుంది.

తొలుత 2015లో యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తెగ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో ద్వారా ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. అటు సినిమాల్లోనూ అడపా దడపా యాక్ట్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..