NTR : అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డూప్‌గా నటించింది ఎవరో తెలుసా..?

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో బ్రాహ్మణుడిగా ఎన్టీఆర్ నటన నిజంగానే అదుర్స్. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ సినిమాకే హైలైట్. ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బ్రహ్మానందంతో పోటీపడి ఎన్టీఆర్ కామెడీ చేసి నవ్వించారు.

NTR : అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డూప్‌గా నటించింది ఎవరో తెలుసా..?
Ntr

Updated on: Mar 08, 2024 | 8:18 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి తన నటనతో కట్టిపడేసారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో బ్రాహ్మణుడిగా ఎన్టీఆర్ నటన నిజంగానే అదుర్స్. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ సినిమాకే హైలైట్. ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బ్రహ్మానందంతో పోటీపడి ఎన్టీఆర్ కామెడీ చేసి నవ్వించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు డూప్ గా నటించింది ఎవరో తెలుసా.?

సినిమాల్లో డూప్ గా నటించడం సహజమే.. అదుర్స్ సినిమా 2010లో వచ్చింది. అప్పటి టక్నాలజీ ప్రకారం ఎన్టీఆర్ కు డూప్ ను వాడారు. ఇంతకు ఎన్టీఆర్ కు డూప్ గా నటించేందుకు ఒక యాక్టర్ ను తీసుకున్నారట. సినిమాలో చాలా వరకు అతనే ఎన్టీఆర్ కు డూప్ గా నటించడట అయితే ఒక సీన్ సమయంలో ఆ డూప్ అందుబాటులో లేకపోవడంతో ఎన్టీఆర్ మేకప్ ఆర్టిస్ట్ కిరణ్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కు డూప్ గా నటించాడట. కిరణ్ తోనే మిగతా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారట వివినాయక్.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో డెన్వర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమా సీక్వెల్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.