
పైన పేర్కొన్న ఫోటోలోని క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు బుల్లితెరనే కాదు.. వెండితెరను కూడా తన అందం, అభినయంతో ఏలేస్తోంది. ఫస్ట్ తన కెరీర్‌ను ఓ న్యూస్ ప్రెజెంటర్‌గా మొదలుపెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత ఓ ప్రముఖ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరించి సత్తా చాటి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించింది. ఒకవైపు బుల్లితెరపై యాంకర్‌గా.. మరోవైపు వెండితెరపై నటిగా అదరగొడుతోంది. ఈ స్టార్ యాంకరమ్మ పలు రియాలిటీ షోలకు హోస్టింగ్ చేసి ఆకట్టుకుంది. ఈపాటికి ఆమెవరో మీకు అర్ధమై ఉండొచ్చు. ఎస్.. పై ఫోటోలో ఉన్నది మరెవరో కాదు అనసూయ భరద్వాజ్. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వెండితెరపై నటిగా రాణిస్తోంది.
అటు స్పెషల్ సాంగ్స్‌లో నటించడమే కాకుండా.. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘చావు కబురు చల్లగా’, ‘థాంక్యూ బ్రదర్’ లాంటి చిత్రాలు అనసూయ కెరీర్‌లో గుర్తిండిపోయేవి.
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప: ది రైజ్’లో దాక్షయనిగా, ‘మైకేల్’లో చారులతగా తన విలనిజాన్ని చూపించింది అనసూయ. కాగా, ప్రస్తుతం ఆమె ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ సినిమాలో, తెలుగులో ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తోంది.