పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ గుర్తుందా.? పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కానీ తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు ఓటీటీలోనూ వెబ్ సిరీస్‌ల్లో నటించింది. ఇప్పటికైనా ఆమె ఎవరో కనిపెట్టారా.? లేదంటే..
టెన్షన్ ఎందుకండీ.! ఆమె మరెవరో కాదు మీరా చోప్రా. 2005వ సంవత్సరంలో అన్బే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది మీరా చోప్రా. ఆ తర్వాత 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బంగారం’తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా క్రేజ్‌తో ఆ వెంటనే తమిళంలో వరుసగా చిత్రాల్లో నటించింది. వాన, మారో, గ్రీకువీరుడు సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది మీరా చోప్రా. ప్రస్తుతం ఈమె చేతుల్లో సినిమాల్లేవు. కాగా, సోషల్ మీడియాలో మీరా చోప్రా లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తరచూ ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వస్తోంది.
ఇది చదవండి: చిన్నప్పుడేమో స్వీటు.. ఇప్పుడేమో యమా హాటు.. ఈ వయ్యారిని గుర్తుపట్టగలరా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..