AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందంలో ఆమెకు సాటిలేరు.. వంద కోట్ల బంగ్లాకు మహారాణి.. ఈ బ్యాచులర్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అందంలో ఆమెకు సాటిలేరు. వందల కోట్ల బంగ్లాకు ఆమె మహారాణి. రూ.332 కోట్లకు యజమాని. దేశంలో ఎక్కడెక్కడో వందల కోట్లు విలువ చేసే ఆస్తులు. కానీ ఈ హీరోయిన్ ప్రత్యేకత కాంచీపురం చీరలే. పట్టుచీరలలో సంప్రదాయంగా సినిమా ఈవెంట్లలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 69 సంవత్సరాలు. ఇప్పటికీ మైమరపించే అందం ఆమె సొంతం. పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..

Tollywood: అందంలో ఆమెకు సాటిలేరు.. వంద కోట్ల బంగ్లాకు మహారాణి.. ఈ బ్యాచులర్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2024 | 1:13 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసురాలు. ఆమె తండ్రి తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారే. కానీ ఆమె మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అందంలో ఆమెకు సాటిలేరు. వందల కోట్ల బంగ్లాకు ఆమె మహారాణి. రూ.332 కోట్లకు యజమాని. దేశంలో ఎక్కడెక్కడో వందల కోట్లు విలువ చేసే ఆస్తులు. కానీ ఈ హీరోయిన్ ప్రత్యేకత కాంచీపురం చీరలే. పట్టుచీరలలో సంప్రదాయంగా సినిమా ఈవెంట్లలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 69 సంవత్సరాలు. ఇప్పటికీ మైమరపించే అందం ఆమె సొంతం. పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. తనే సీనియర్ హీరోయిన్ రేఖ.

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో రేఖ ఒకరు. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా రాణిలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దివంగత నటుడు జెమిని గణేశన్,, పుష్పవల్లి దంపతుల కుమార్తె. హిందీలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా, బాలీవుడ్‌లోని అన్ని ప్రధాన ఈవెంట్‌లలో రేఖ పాల్గోంటుంది. ఖరీదైన కాంచీపురం చీరలు , బంగారు ఆభరణాలతో ఈవెంట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండస్ట్రీలోని అత్యంత ధనిక హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ప్రస్తుతం రేఖ ఆస్తి రూ.332 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె ముంబైలోని బసేరా అనే బంగ్లాలో నివస్తుంది. ఆ బంగ్లా విలువ రూ.100 కోట్లు.

నటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. వాటి ద్వారా నెలకు లక్షలు అద్దెలు సంపాదిస్తున్నారు. రేఖ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.01 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (రూ. 2.17 కోట్లు), ఆడి ఎ8 (రూ. 1.63 కోట్లు), హోండా సిటీ (రూ. 13 లక్షలు) మరియు బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ (రూ. 2.03 కోట్లు) నటి రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ వంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు రూ.1 లక్ష వరకు తీసుకుంటుందట. అలాగే తన ఫోటోలను బిల్ బోర్డ్స్ పై ఉపయోగించేందుకు రూ.10 నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తుందట. నటిగా సినిమాల్లో చురుకుగా ఉన్న సమయంలోనే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టిందట. ఆమె పేరు మీదు అనేక ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిందట. అలాగే రేఖ వద్ద వందలాది కాంచీపురం చీరలు ఉన్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Rekha (@legendaryrekha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్