క్రేజీ ఫోటోతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పాన్ ఇండియా హీరోయిన్ గురూ..

స్విమ్మింగ్ పూల్ పక్కన సెగలు పుట్టిస్తున్న వయ్యారాలతో ఫోటో దిగిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.? 2008లో ‘రెయిన్ బో’ అనే చిత్రం ద్వారా..

క్రేజీ ఫోటోతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పాన్ ఇండియా హీరోయిన్ గురూ..
Tollywood

Updated on: Jun 01, 2023 | 12:57 PM

స్విమ్మింగ్ పూల్ పక్కన సెగలు పుట్టిస్తున్న వయ్యారాలతో ఫోటో దిగిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.? 2008లో ‘రెయిన్ బో’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతో ఎలాంటి గుర్తింపు రాలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం అడపాదడపా అవకాశాలు వచ్చాయి. ఇక ‘లెజెండ్’ మూవీతో.. ఫుల్ గ్లామరస్ పాత్రలో కనిపించి.. కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకుంది. త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీతో అభిమానులను పలకరించనుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? మీకో క్లూ.. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించింది.

ఆమె మరెవరో కాదు.. సోనాల్ చౌహాన్. మోడలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2008లో ‘జన్నత్’ అనే హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే అదే ఏడాది తెలుగులో ‘రెయిన్ బో’ మూవీతో అరంగేట్రం చేసింది. అందం, అభినయంతో ఫ్యాన్స్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’, ‘ఎఫ్ 3’, ‘ది ఘోస్ట్’ లాంటి చిత్రాలు సోనాల్ చౌహాన్ కెరీర్‌లో చెప్పుకోదగినవి. ఈ బ్యూటీ మరికొద్ది రోజుల్లో ప్రభాస్ హీరోగా వస్తోన్న ‘ఆదిపురుష్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాల్ చౌహన్.. తన వెకేషన్ ఫోటోలు, లేటెస్ట్ ఫోటోషూట్స్‌లను ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.