ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!

డైరెక్టర్ కృష్ణవంశీ తన “ఖడ్గం” చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యా్న్ బేస్ ఉంటుంది. ఈ మూవీ విడుదలై 22 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు .

ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
Khadgam

Updated on: Jun 23, 2026 | 10:30 AM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలో ఖడ్గం సినిమా ఒకటి. ఖడ్గం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002 లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ ఈ సినిమాకు కథను అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించారు.

ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీ చిన్నదే అయినా.. సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అదే అని చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది సోనాలి. అయితే ఈ సినిమాలో సోనాల్ బింద్రే పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ వాయిస్ ఇచ్చారు. సోనాలికు ఓ స్టార్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పారు. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఓ మై గాడ్..! అన్నా.. ఇది నువ్వేనా..!! పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్

కొన్ని సినిమాలో హీరోయిన్ పాత్రలకు మరో హీరోయిన్ వాయిస్ ఇవ్వడం కామనే చాలా సినిమాల్లో ఇలా జరిగింది. అలాగే ఖడ్గం సినిమాలోనూ జరిగింది. సోనాలి బింద్రే పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్య కృష్ణ హీరోయిన్ మాత్రమే కాదు. కృష్ణవంశీ సతీమణి కూడా.. దాంతో ఈ సినిమాలో సోనాలి పాత్రకు ఆమె గాత్ర దానం చేశారు. రమ్య కృష్ణ ప్రస్తుతం సహాయక నటిగా నటిస్తున్నారు. బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ మరోసారి పాపులర్ అయ్యారు. శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. దాంతో ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us