ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు,హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో చాలామంది ఛైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వారే. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అఖిల్, రాశి, మీనా, హన్సిక, షాలినీ, తమన్నా.. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న బాలయ్యతో ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా ఈ కోవకు చెందిన వారే. బాలనటులుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వీరిద్దరు ఆతర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా బిజీ అయిపోయారు. వివరాల్లోకి వెళితే.. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం బాలగోపాలుడు. సుహాసిని కథానాయికగా కనిపించింది. మోహన్ బాబు విలన్‌గా నటించాడు. కాగా పల్లెటూరి నేపథ్యంగా తెరకెక్కిన బాలగోపాలుడు సినిమాలో అనాథ అక్కాచెల్లెళ్లుగా ఇద్దరు చిన్నారులు అద్భుతంగా నటించారు. పై ఫొటోలో ఉన్నది వారే. మరి వారెవరో గుర్తుపట్టారా? అబ్బాయిని గుర్తుపట్టేచ్చేమో కానీ.. అమ్మాయిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఏం ప్రాబ్లం లేదు. వారెమరో మేమే చెప్పేస్తాం. ఈ చైల్డ్ ఆర్టిస్టులు మరెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్, హీరోయిన్ రాశి.
బాలగోపాలుడు సినిమాలో కల్యాణ్ రామ్, రాశి అన్నా చెల్లెళ్లుగా నటించారు. సినిమాలో వీరి పాత్రలకు మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఛైల్డ్ ఆర్టిస్టుగా మరే సినిమాలోనూ నటించలేదు కల్యాణ్ రామ్. రాశి మాత్రం బాలనటిగా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాలు చేసింది. బాలగోపాలుడు తర్వాత తెలుగులో ఆదిత్య 369, అంకురం, రావుగారిల్లు, పల్నాటి పౌరుషం, పుట్టినిల్లా మెట్టినిల్లా, మమతల కోవెల తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో టాప్ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. అయితే రాశి హీరోయిన్ అయ్యాక.. చాలా కాలానికి కల్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. అదే సమయంలో రాశి స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తోంది. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..