
ఏడాది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా కుమ్మేశాయి. తెలుగులోనూ ఈసారి చాలా సినిమాలు విజయం సాధించాయి. కాగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎదో తెలుసా.? ఈ ఏడాది సూపర్ స్టార్స్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈఏడాది బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఇటీవలే అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మొదటిగా హరిహరవీరమల్లు సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత ఓజీ వచ్చింది.
సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఎదో తెలుసా అదే లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 24 కోట్ల ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. మౌళి తనుజ్, శివాని నాగారం నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిన్న సినిమా..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.