AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ రికార్డ్..! సినీ ఇండస్ట్రీలోనే చెత్త సినిమా..!! వేలకోట్లు నష్టపోయిన నిర్మాతలు

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నిర్మాతలకు పెద్ద షాకిచ్చింది.

వరల్డ్ రికార్డ్..! సినీ ఇండస్ట్రీలోనే చెత్త సినిమా..!! వేలకోట్లు నష్టపోయిన నిర్మాతలు
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 10:42 AM

Share

ప్రతి శుక్రవారం థియటర్స్ లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక వైపు ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. థియటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా వరుసగా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇక భారీ బడ్జెట్స్ తో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య థియేటర్స్ లో భారీ డిజాస్టర్ అవుతున్నాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమాలు చాలా థియేటర్స్ కు వచ్చిన తర్వాత దారుణంగా నిరాశపరిచాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

సినీ ఇండస్ట్రీలోనే బిగెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది.. ఈ సినిమా వల్ల ఏకంగా రూ.1,393 కోట్లు నష్టపోయారు నిర్మాతలు. వలర్డ్ సినిమా హిస్టరీలో ఇంత పెద్ద మొత్తంలో నష్టపోయిన సినిమా మరొకటి లేదట.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఎదో కాదు జాన్ కార్టర్.. ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వం వహించిన ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఇది. విడుదలకి ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం కాలేదు.. దీని కారణంగా డిస్నీకి ఆర్థిక నష్టాలు వచ్చాయి.

ఈ సినిమా ఏకంగా 250 మిలియన్ డాలర్లుతో తెరకెక్కించారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో రూ.2,171 కోట్లకు పైగా.. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో విజువల్స్ మాత్రం పేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. సినిమా డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ గా మార్కెటింగ్ మైనస్. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో మేకర్స్ ఘోరంగా ఫెయిలయ్యారు. అందుకే సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us