Deepika Padukone: ఆ స్టార్ హీరోతో సినిమా.. ఆరుసార్లు రిజెక్ట్ చేసిన దీపికా.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం కల్కి సినిమా నుంచి ఆమెను తీసేయడమే. కల్కి సెకండ్ పార్ట్ లో దీపికా భాగం కాదంటూ కల్కి మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీంతో దీపికా సినీప్రయాణం, పర్సనల్ విషయాల కోసం సెర్చ్ చేస్తున్నారు జనాలు.

Deepika Padukone: ఆ స్టార్ హీరోతో సినిమా.. ఆరుసార్లు రిజెక్ట్ చేసిన దీపికా.. ఎందుకంటే..
Deepika Padukone

Updated on: Sep 18, 2025 | 5:46 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ అమ్మాయి ఇప్పుడు బీటౌన్ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలోనూ కనిపించింది. అయితే కొన్నాళ్ల క్రితం పాపకు జన్మనిచ్చిన దీపికా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో నటిస్తుంది. ఇదెలా ఉంటే.. ఇప్పుడు దీపికా పేరు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఎందుకంటే అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి పార్ట్ 2లో ఆమె భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత దీపిక కెరీక్ గురించి అనేక వార్తలు సెర్చ్ చేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోతో వచ్చిన సినిమాలను ఆమె ఆరుసార్లు రిజెక్ట్ చేసింది. అతడు ఎవరో కాదు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్. జై హో, సుల్తాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, కిక్, కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శుద్ధి (చివరికి దానిని పక్కన పెట్టారు) వంటి పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. అలాగే కిక్ సినిమాలో స్పెషల్ పాట కోసం ఆమెను సంప్రదించగా.. అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ కావడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఇన్షాల్లా చిత్రంలో సల్మాన్‌తో కలిసి పనిచేయాలని దీపిక తన కోరికను వ్యక్తం చేసింది, కానీ ఆ ప్రాజెక్ట్ కోసం చివరకు అలియా వద్దకు వెళ్లింది. ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి సైతం దీపికా తప్పుకుంది. ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ నుంచి సైతం తప్పుకోవడంతో ఆమె అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Salman Khan, Deepika

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..