2014లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా అందరికీ గుర్తుండొచ్చు. ఇందులో వెంకీ పెద్ద కూతురుగా నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.? ఆ సినిమాలోనే కాదు.. ఇటీవల వచ్చిన సీక్వెల్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈమె తెలుగులో నటించింది తక్కువ సినిమాలే. బేసిక్‌గా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈ హీరోయిన్ మరెవరో కాదు కృతిక జయకుమార్.
బెంగళూరుకు చెందిన ఈమె.. మొదటి నుంచి సినిమాలకు చాలా దూరంగా ఉంది. ఏడేళ్ల వయస్సులోనే భరతనాట్యంపై మక్కువ పెంచుకున్న కృతిక.. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్‌పై పలు షోలలో పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే ఈమెను తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ చూసి.. సినిమాల్లో ప్రయత్నించమని చెప్పారు. అనంతరం తెలుగు ‘దృశ్యం’ సినిమాకు ఆడిషన్‌కు వెళ్లగా.. ఈమె అందులో ఎంపిక అయింది. తద్వారా సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది.
2014లో టాలీవుడ్‌లోకి ‘దృశ్యం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిక జయకుమార్.. ఆ తర్వాతి ఏడాదిలోనే కన్నడంలో ‘బాక్సర్’.. తెలుగులో ‘వినవయ్య రామయ్య’ చిత్రాల్లో నటించింది. ఇక అనంతరం ‘రోజులు మారాయి’, ‘ఇంట్లో దెయ్యం నాకెం భయం’ లాంటి చిత్రాల్లో నటించినా.. ఈమెకు పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. 2021లో మళ్లీ దృశ్యం సీక్వెల్‌తో ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.
ప్రస్తుతం బెంగళూరులో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న కృతిక జయకుమార్.. యోగా టీచర్‌గా, డిజిటల్ మార్కటర్‌గా చేస్తూ.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.