AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌కు ఎంతో ఇష్టమైన పాట ఏదో తెలుసా.. ఆ స్టార్ హీరో సాంగ్ రెబల్ స్టార్‌కు చాలా స్పెషల్ అంట

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చూస్తే మెంటలెక్కుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ప్రభాస్‌కు ఎంతో ఇష్టమైన పాట ఏదో తెలుసా.. ఆ స్టార్ హీరో సాంగ్ రెబల్ స్టార్‌కు చాలా స్పెషల్ అంట
Prabhas
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2026 | 4:06 PM

Share

టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌ ప్రభాస్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.  ఆయన సినిమాలు, వ్యక్తిగత అభిరుచులు, ఇంటర్వ్యూల్లో పంచుకునే ఆసక్తికర విషయాలపై ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ప్రభాస్‌కు ఇష్టమైన సినిమాలు, పాటలు, రచయితల గురించి తెలిసినప్పుడు అభిమానులు మరింత వైరల్ చేస్తుంటారు. ఒక సందర్భంలో ప్రభాస్ తనకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఆయన పాటలంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. తన అద్భుతమైన సాహిత్యంతో ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించిన సిరివెన్నెల రచనలు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎమోషన్స్ పలికించే ఆయన పదాలు, జీవితానికి దగ్గరగా ఉండే సాహిత్యం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే ప్రభాస్ కు కూడా ఆయన పాటలంటే చాలా ఇష్టమట.

అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాలోని ‘చలోరే చలోరే చల్’ పాట కూడా ప్రభాస్‌కు ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి అని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో విడుదలై ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, పాటల చిత్రీకరణ అప్పట్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ‘చలోరే చలోరే చల్’ పాటలోని సంగీతం, స్ఫూర్తినిచ్చే సాహిత్యం ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టుల్లో చోటు సంపాదించుకుంటూనే ఉంది. ప్రభాస్ వంటి స్టార్ హీరోకు కూడా ఈ పాట ఇష్టమనే విషయం అభిమానుల్లో ఆసక్తిని కలిగించే అంశం.

సాధారణంగా హీరోలు తమకు నచ్చిన పాటలు, సంగీత దర్శకులు, గేయ రచయితల గురించి చెప్పినప్పుడు అభిమానులు వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు. అయితే, ప్రభాస్‌కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంపై ఉన్న అభిమానం, ‘జల్సా’ సినిమాలోని పాటపై ఆయనకున్న ఇష్టం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా , హనురాఘవపుడి డైరెక్షన్లో ఫౌజి, అలాగే ప్రశాంత్ నీల్ సలార్2, నాగ్ అశ్విన్ కల్కి2 ఇలా చాలా సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us