AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్టార్ డైరెక్టర్ కూతురు టాప్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే

సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ దర్శకుడి కూతురి ఫోటో నెట్టింట తెగ షికారు చేస్తుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన కూతురి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ స్టార్ డైరెక్టర్ కూతురు టాప్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Ks Ravi Kumar
Rajeev Rayala
|

Updated on: May 10, 2025 | 1:45 PM

Share

తమిళ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి దర్శకుల్లో స్టార్ డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ ఒకరు. ఈ సీనియర్ దర్శకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల గురించి చెప్పాలంటే ఒకే ఒక్క సినిమా చాలు. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవికుమార్. ఇక తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు.

కే.ఎస్ రవికుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే ఆయన బాలకృష్ణతో రెండు సినిమాలు చేశారు. జై సింహ, రూలర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన స్నేహం కోసం సినిమాకు కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఇక పోతే ఈయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్.రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు.అందులో చిన్న కుమార్తె జస్వంతి మాత్రం తెగ పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ లుక్ లో ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ అమ్మడు ఫోటోలు చూసి నెటీజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్స్ తో ఈ బ్యూటీ ఫోటోలకు క్రేజ్ పెంచేసింది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద