
ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా ఉన్నవారిలో చాలా మంది గతంలో వివిధ రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. డాక్టర్ గా, ఇంజనీర్లుగా, సాఫ్ట్ వేర్లుగా సేవలు అందించిన వారే. అయితే నటనపై మక్కువతో లక్షల జీతాలొచ్చే జాబులను వదిలేసుకుని మరీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. సినిమాల్లోకి రాక ముందు ఈ ముద్దుగుమ్మ ఫిజియో థెరపిస్టుగా సేవలు అందించింది. అసలు ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కలలు కందట. అందుకు తగ్గట్టుగానే వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని డాక్టర్ విఠల్‌రావ్ విఖే పాటిల్ ఫౌండేషన్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆపై ఫిజయో థెరపిస్టుగా సేవలు అందించింది. అయితే 2020 లో లాక్డౌన్ సమయంలో ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించింది. వీటికి నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు కూడా వీటిని చూసి సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట. అలా సినిమాల ఆడిషన్స్ కు హాజరైందట. కట్ చేస్తే.. ఇప్పుడీ హీరోయిన్ పేరు టాలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? నారీ నారీ నడుమ మురారీతో కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకున్న సాక్షి వైద్య.
మహారాష్ట్రలోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి వైద్య జన్మించింది. ఫిజియో థెరపిస్టుగా చేస్తూనే మోడల్ గా మంచి పాపులారిటి సంపాందించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా అవకాశాలకై ఎదురుచూస్తున్న ఆమెకు తెలుగులో ఏజెంట్ చిత్రబృందం హీరోయిన్ గా ఎంపిక చేసింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి గాంఢీవధారి అర్జున సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బోల్తా పడింది. అయితే ఎట్టకేలకు మూడో సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి హిట్ అందించింది. సంక్రాంతికి విడుదలైన నారీ నారీ నడుము మురారి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శర్వా హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మేనన్ తో పాటు సాక్షి వైద్య మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి.
కాగా సినిమాల్లోకి రాకముందు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ సాక్షి నటించింది. రిలయన్స్ జ్యువెల్స్ ద్వారా కాస్యం కలెక్షన్ తో సహా వివిధ టీవీ వాణిజ్య ప్రకటనలలో ఈ బ్యూటీ కనిపించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..