
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లిపీటలెక్కనున్నట్లు గత రెండు రోజులుగా తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు ప్రేమికుల దినోత్సవం రోజు (ఫిబ్రవరి 14) న మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే తమ డేటింగ్, పెళ్లి విషయమై ఇటు ధనుష్ కానీ, అటు మృణాళ్ ఠాకూర్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ గాసిప్‌లు మాత్రం జోరుగా వస్తున్నాయి. ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి ఏజ్ గ్యాప్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్టు 1, న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 33 సంవత్సరాలు. ఇక నటుడు ధనుష్ విషయానికి వస్తే.. 1983 జూలై 28, న జన్మించాడు. ఇప్పుడు ఆయనకు 42 సంవత్సరాలు. అంటే ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య 9 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ చివరిగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమాలో నటించింది. ఆగస్టు 2025లో ఈ మూవీ విడుదలైంది. ఆ సినిమా ప్రీమియర్‌లో మృణాల్ ఠాకూర్, ధనుష్ కలిసి కనిపించారు. అక్కడి నుంచి వారి డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. ధనుష్ తో రిలేషన్ వ్యవహారంపై ఒక సందర్భంలో స్పందించిన మృణాళ్ ‘మేము కేవలం స్నేహితులం’ అని చెప్పుకొచ్చింది.
ధనుష్ గతంలో ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకున్నాడు. 2004లో వీరి వివాహం జరగ్గా, యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే పెళ్లైన 20 సంవత్సరాల తర్వాత ధనుష్, ఐశ్వర్యల విడిపోయారు. 2024 లో వారు విడాకులు తీసుకున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణ చిత్రాలలో కూడా మృణాళ్ నటించింది. తెలుగులో ఆమె నటించిన సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
It’s True Then ?
Look at her affection when she found Him . #MrunalThakur #Dhanush pic.twitter.com/AUFHkeEhCe https://t.co/gzuaz0GWr8
— విష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳 🚩 (@vishnureddy_899) January 17, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..