
బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మల్లిడి వశిష్ఠ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రమైన విశ్వంభర సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవితో సినిమా చేయాలనేది చాలా మంది యువ దర్శకుల కల అని, అది తనకు అక్షరాలా నిజమైందని వశిష్ఠ తెలిపారు. బింబిసార తర్వాత, UV క్రియేషన్స్ విక్రమ్ ద్వారా చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని, ఆపై రామ్ చరణ్ ప్రోత్సాహంతో చిరంజీవికి కథ చెప్పానని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండానే సాధ్యమైందని, ఇది ఒక మిరాకిల్ అని వశిష్ఠ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
కథ చెప్పేటప్పుడు చిరంజీవి తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా కథ చెప్పమని ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. “చిరంజీవి గారు మొదటిసారి కలిసినప్పుడు, కథ చెప్పడానికి వచ్చావు. నువ్వు చిరంజీవికి కథ చెప్తున్నావని మర్చిపో. నువ్వు హిట్ సినిమా తీసిన దర్శకుడివని మర్చిపో. ఒక ఆడియన్ గా, ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ కి ఎలా కథ చెప్తావో అలా చెప్పు. నాకు అనిపించింది నేను చెప్తాను. నచ్చితే, ఇంప్లిమెంట్ చెయ్. లేదంటే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పేయ్. కాల్ నీదే లాస్ట్‌లో అని చెప్పారు” అని వశిష్ఠ వెల్లడించారు. దీనివల్ల ఆయనతో సులభంగా మాట్లాడనని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
చిరంజీవితో వశిష్ఠకు చిన్నతనం నుంచే పరిచయం ఉందని తెలిపారు. రామ్ చరణ్, అల్లు శిరీష్, రానా వంటి వారితో తాను బ్యాచ్ మేట్ నని, చిన్నప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లేవాడినని తెలిపారు. శంకర్ దాదా MBBS చిత్రానికి అప్రెంటీస్ గా కూడా పనిచేశానని పేర్కొన్నారు. విశ్వంభర చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయని, ఇది కేవలం ఒక ఫాంటసీ చిత్రమే తప్ప జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదని వశిష్ఠ స్పష్టం చేశారు. ఈ విషయంలో అశ్వనీ దత్ నుండి వచ్చిన నోటీసు గురించి ప్రస్తావించగా, అది మీడియాలో వచ్చిన ఊహాగానాల వల్ల జరిగిందని, తన చిత్రానికి దానితో సంబంధం లేదని వశిష్ఠ అన్నారు. గతంలో ముల్లోక వీరుడు వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా, తాను వాటి గురించి ఆలోచించలేదని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..