Tollywood: ‘ఎం.ఎస్‌ నారాయణపై చేయి చేసుకున్న తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా..?

తెలుగు తెరపై మెరిసిన హాస్యనటుల్లో ఒకొక్కరిది ఒక్కో శైలి. తాగుబోతు పాత్రలపై తనదైన ముద్ర వేశారు దివంగత ఎమ్మెస్‌ నారాయణ. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆ తరువాత హాస్య నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభని చాటారు. అయితే ఎమ్మెస్ నారాయణపై ఓ తెలుగు దర్శకుడు ఓ సందర్భంలో చేయి చేసుకున్నారట. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

Tollywood: ‘ఎం.ఎస్‌ నారాయణపై చేయి చేసుకున్న తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా..?
MS Narayana

Updated on: Apr 20, 2024 | 2:46 PM

ఎమ్మెస్‌ నారాయణ తెలుగు తెరపై తన మార్క్ వేసిన కమెడియన్. కేవలం హాస్యభరిత పాత్రలే కాదు.. ఎమోషనల్ సీన్లలోనూ ఆ శైలి విభిన్నం. తాగుబోతు పాత్రలపై తనదైన ముద్ర వేశారు. పేరడీ పాత్ర వేయాలంటే.. తెలుగు మేకర్స్‌కు తొలిగా గుర్తుకొచ్చే నటుడు ఎమ్మెస్‌ నారాయణే. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తరువాత హాస్య నటుడిగా, డైరెక్టర్‌గా తన ప్రతిభని చాటారు. ‘శివమణి’, ‘దూకుడు’, ‘సర్దుకుపోదాం రండి’, ‘రామసక్కనోడు’, ‘మా నాన్నకి పెళ్లి’ సినిమాలకుగానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. సుమారు 700పైగా సినిమాల్లో నటించిన ఎమ్మెస్‌ నారాయణ 2015లో సంక్రాంతి పండగకి సొంతూరు  పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు వెళ్లి, అక్కడే అస్వస్థతకి గురై తుదిశ్వాస విడిచారు.

అయితే అంతటి ఘన కీర్తి కలిగిన ఎమ్మెస్‌ నారాయణపై ఓ తెలుగు దర్శకుడు సెట్స్‌లో చేయి  చేసుకున్నాడట. ఆయన ఎవరో కాదు దర్శకుడు సాగర్.  ‘రాకాసి లోయ’,  ‘డాకు’,  ‘మావారి గోల’ ,  ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ వంటి సినిమాలను తెరకెక్కించారు ఈ దర్శకుడు. సాగర్ ఒకసారి ఎం.ఎస్‌.నారాయణపై చేయి చేసుకున్నారట. ఈ విషయాన్నే ఆయనే ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. ఓసారి సాగర్ సినిమా కోసం ఎమ్మెస్‌ నారాయణ పనిచేశాడట. తనకు డబ్బు అవసరం ఉందని.. సాయంత్రం కల్లా డబ్బు ఇవ్వమని ప్రొడ్యూసర్‌ని అడిగాడట. నిర్మాత కూడా ఇస్తానని మాటిచ్చాడట. అయితే, మధ్యాహ్నం లంచ్ చేస్తూ నిర్మాత గురించి అమర్యాదకరంగా మాట్లాడారట ఎమ్మెస్‌ నారాయణ . అలా అనకూడదని వారించినా వినలేదట. దాంతో  సహనం కోల్పోయి  ఎం.ఎస్‌.నారాయణపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని దర్శకుడు సాగర్ చెప్పారు.

వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటివారు దర్శకుడు సాగర్ శిష్యులే. యాక్షన్‌ తరహా చిత్రాలతో సినీ ప్రియులను కొన్నేళ్ల పాటు అలరించిన ఆయన 2023లో కన్నుమూశారు.

Director Sagar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.