
వైష్ణవి చైతన్య.. ఇప్పుడు ఈ అమ్మడు పేరు టాలీవుడ్ లో కాస్త ఎక్కుగానే వినిపిస్తుంది. వైష్ణవి హీరోయిన్ గా నటించిన తొలి సినిమా బేబీ. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ అవ్వడంతో వైష్ణవి పేరు మరు మ్రోగుతోంది. వైష్ణవి చైతన్య సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికీ బాగానే తెలుసు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు నటించిన వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ బ్యూటీ నటించిన సాఫ్ట్ వేర్ డవలపర్స్ మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు బేబి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రమోషన్స్ లో వైష్ణవి ఎమోషనల్ స్పీచ్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి తెలిపింది. అలాగే బేబీ సినిమాతో నటిగా వైష్ణవి నిరూపించుకుంది. తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ.
ఇక ఈ అమ్మడు తన కెరీర్ లో అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి మాట్లాడుతూ తన మొదటి రెమ్యునరేషన్ గురించి తెలిపింది. తన మొదటి సంపాదన 700 అని చెప్పింది. ఓ ఈవెంట్ కోసం డ్యాన్స్ చేస్తే 700 ఇచ్చారట. రోజంతా కష్టపడి డాన్స్ చేస్తే 700 ఇచ్చారని తెలిపారు. ఆ రెమ్యునరేషన్ తనకు చాలా ప్రత్యేకం అని తెలిపింది.