Puri Jagannadh: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే భయ్యా..! పూరి గారి డాటర్.. హీరోయిన్ ఫీచర్స్..

|

Feb 02, 2024 | 1:14 PM

హీరోలను డిఫరెంట్ లుక్స్ తో పాటు మాస్ లుక్ లో చూపించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు పూరిజగన్నాథ్. ఆయన సినిమాలో డైలాగ్స్ రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా ఉంటాయి. చివరిగా పూరిజగన్నాథ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Puri Jagannadh: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే భయ్యా..! పూరి గారి డాటర్.. హీరోయిన్ ఫీచర్స్..
Puri Jagannadh Daughter
Follow us on

టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గురించి ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పూరిజగన్నాథ్ సినిమాలు రెగ్యులర్ సినిమాలకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హీరోలను డిఫరెంట్ లుక్స్ తో పాటు మాస్ లుక్ లో చూపించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు పూరిజగన్నాథ్. ఆయన సినిమాలో డైలాగ్స్ రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా ఉంటాయి. చివరిగా పూరిజగన్నాథ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు పూరిజగన్నాథ్. అయితే పూరిజగన్నాథ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలుసు.. ఆయనకు ఓ కుమారుడు,కూతురు.

పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అంతకు ముందు ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. అలాగే పూరిజగన్నాథ్ కూతురు కూడా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. పూరిజగన్నాథ్ కూతురు పేరు పవిత్ర.. ఈ చిన్నది పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించింది.

ఆతర్వాత పవిత్ర సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఆకాష్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. పవిత్ర మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అన్న ఆసక్తి నెటిజన్స్ లో మొదలైంది. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అని సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే పవిత్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవిత్ర ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చదువు పై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని పవిత్ర అడపాదడపా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

పవిత్ర ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.