Tollywood: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో.. ఎవరో తెల్సా

|

Sep 27, 2024 | 7:09 PM

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లకు కొదవలేదు. బ్రహ్మానందం నుంచి సత్య వరకు మన డైరెక్టర్లు తీర్చిదిద్దిన మేటి కమెడియన్లు ఎందరో ఉన్నారు. భాష, యాస, భిన్నమైన బాడీ లాంగ్వేజ్, తమదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో.. ఎవరో తెల్సా
Lakshmipati Comedian
Follow us on

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లకు కొదవలేదు. బ్రహ్మానందం నుంచి సత్య వరకు మన డైరెక్టర్లు తీర్చిదిద్దిన మేటి కమెడియన్లు ఎందరో ఉన్నారు. భాష, యాస, భిన్నమైన బాడీ లాంగ్వేజ్, తమదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఇక టాలీవుడ్‌లో కమెడియన్ లక్ష్మీపతి ప్రత్యేక క్రేజ్ ఉంది. దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించిన లక్ష్మీపతి.. తొలుత రచయితగా తన కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘చంద్రలేఖ’ చిత్రానికి రచనా సహకారం అందించారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘చూడాలనివుంది’ చిత్రంతో నటుడిగా మారారు. ఇక ఈవీవీ తెరకెక్కించిన ‘అల్లరి’ సినిమాతో మంచి బ్రేక్ సాధించారు లక్ష్మీపతి. అటు తమ్ముడు శోభన్ డైరెక్ట్ చేసిన ‘బాబీ’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు లక్ష్మీపతి.

లక్ష్మీపతికి శ్వేతా, కేతన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా తమ్ముడు అవుతాడు. 2008లో శోభన్ అనారోగ్య సమస్యలతో మరణించగా.. ఆ తర్వాత ఆయన మరణించిన నెల రోజులకే లక్ష్మీపతి కూడా కుంగుబాటుకు గురై మృతి చెందారు. శోభన్ ఇద్దరు కొడుకులు ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోలు.. సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. 2011లో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శోభన్. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’, ‘ఏక్ మినీ కథ’, ‘అన్నీ మంచి శకునములే’ లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక సంగీత్ శోభన్ ‘మ్యాడ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకోగా.. ఇప్పుడు దాని సీక్వెల్ ‘మ్యాడ్-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి