Anil Ravipudi: అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
Anil Ravipudi

Updated on: Jan 13, 2026 | 6:18 PM

టాలీవుడ్ లో ది గ్రేట్ రాజమౌళి తర్వాత అపజయమెరగని దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడినే అని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు 9 సినిమాలు తెరకెక్కించాడు. దాదాపు అన్ని హిట్ బొమ్మలే. మొదటి సినిమా పటాస్ మొదలుకుని ఇప్పటి మన శంకరవరప్రసాద్ గారు అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేశాయి. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ ఇలా అనిల్ రావిపూడి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. కాగా డైరెక్టర కాక ముందు కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా వ్యవహరించాడు అనిల్ రావిపూడి. అలాగే పవన్ కల్యాణ్ తమ్ముడు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శంఖం, కందిరీగ, మసాలా, ఆగడు తదితర సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు.

ఇక డైరెక్టర్ గా మెగా ఫొన్ పట్టుకుని అనిల్ రావిపూడి తెరకెక్కించిన మొదటి సినిమా పటాస్. 2015లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ గా అనిల్ కు మంచి డెబ్యూ ఇచ్చింది. పోలీస్ కాప్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించాడు. శ్రుతి సోధి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు హీరోగా కల్యాణ్ రామ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ విషయాన్ని అనిల్ రావిపూడినే ఇటీవల ఓ సందర్భంలో బయట పెట్టాడు.

ఇవి కూడా చదవండి

‘ నా మొదటి సినిమా పటాస్ కథ పట్టుకుని ముందుగా హీరో రామ్ పోతినేని దగ్గరికే వెళ్లాను. కథ వినగానే రామ్ ఒక్క నిమిషం పాటు పూర్తిగా టెంప్ట్ అయిపోయ్యారు. కథ అద్భుతంగా ఉందని, కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నారు. అయితే ఆ టైంలో ఆయన పోలీసుగా చేయాలా అనే సందిగ్ధంలో ఆగిపోయి, 90 శాతం ఓకే అయిందని అనుకున్న సినిమా, కేవలం ఒక 10 శాతం అడ్డంకి వల్ల పట్టాలెక్కలేదు’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనిల్ రావిపూడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.