
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మమ్ముట్టికి కూతురిగా, ప్రియురాలిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమెకు తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత కథానాయికగా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. ఇప్పటికీ సినీరంగంలో చాలా చురుగ్గా ఉంటుంది. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు పోషిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా. ? తనే హీరోయిన్ మీనా.
1984లో పి.జి దర్శకత్వం వహించిన ‘ఒరు కొచ్చు కథ నీయదా పరాయత్త కథ’ చిత్రంలో మీనా మమ్ముట్టి కుమార్తెగా నటించింది. ఆ సినిమాలో మమ్ముట్టికి కూతురితో సమానమైన పాత్ర పోషిచింది. ఆ సినిమాలో మీనాకు తండ్రిగా కనిపించారు మమ్ముట్టి. ఆ తర్వాత ఆయనకే తల్లి పాత్రలో కనిపించింది. కేవలం మమ్ముట్టికే కాదు..రజినీకాంత్ కూతురిగా, భార్యగా కనిపించింది. అలాగే చిన్నప్పుడు బాలకృష్ణతో నటించి.. ఆ తర్వాత ప్రియురాలిగా కనిపించింది. మలయాళంలో రాక్షస రాజా, కరుత పక్షులు, కథా పరియంబోల్ వంటి చిత్రాల్లో మమ్ముట్టితో జత కట్టింది మీనా.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మీనా.. చిన్న వయసులోనే మమ్ముట్టికి కూతురిగా కనిపించింది. ఆ తర్వాత మమ్ముట్టికి ప్రియురాలిగా కనిపించింది. అలాగే ఫ్రెండ్ సినిమాలో మమ్ముట్టి తల్లిగా కనిపించింది. ఇందులో మమ్ముట్టి నజీబ్ పాత్రలో కనిపించారు. దక్షిణాదిలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది మీనా.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..