
బాలీవుడ్ నటి కాజోల్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది. దక్షిణాదిలో బీటెక్ రఘువరన్ 2 అనే సినిమాలోనూ మెరిసింది. ఇదిలా ఉంటే కాజోల్ కు సంబంధించి ఇప్పుడు ఒక ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది. 1997లో విడుదలైన బాలీవుడ్ లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ఇష్క్’. ఇందులో కాజోల్ తో పాటు ఆమిర్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, జూహి చావ్లా వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని సన్నివేశాలు, పాటలు, డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈ చిత్రంలో ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటించింది. ముఖ్యంగా కాజోల్‌తో కలిసి పలు సీన్లలో నటించింది. అలా 28 ఏళ్ల క్రితం ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ‘దంగల్’ ఫేమ్
ఫాతిమా సనా షేక్.
ఫాతిమా సనా షేక్ నటించిన ‘గుస్తాఖ్ ఇష్క్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్ల సమయంలో ఫాతిమా తెల్లటి చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలకు నటి కాజోల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి కెమెరాకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారాయి. దీంతో హిందీ ప్రేక్షకులు వెంటనే ‘ఇష్క్’ సినిమాలోని ఆ పాత సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. అందులో కాజోల్ ఫాతిమా కలిసి నటించిన సీన్లను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ‘దంగల్’ సినిమాకు తాను ఆమిర్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నానని ఆమె చెప్పింది. “చాలా సంవత్సరాల క్రితం ‘ఇష్క్’ సినిమాలో ఆమిర్, కాజోల్ లతో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇష్క్ సినిమాలో కాజోల్, ఫాతిమాల సీన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి.
కాగా ‘దంగల్’ చిత్రంలో గీతా ఫోగట్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఫాతిమా సనా షేక్. అయితే అంతకు ముందే నువ్వు నేను ఒక్కటవుదాం అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. వీటి తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఆ మధ్యన మాధవన్ తో కలిసి ఆమె నటించిన ఆప్ జైసా కోయి సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి