AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ.. అమ్మడి పనైపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలు

తెలుగు సినిమా ప్రపంచంలో తొలి చిత్రంతోనే కుర్రకారును ఆగం చేసింది. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఈ వయ్యారి.. నటిగా ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా డిజాస్టర్ అయ్యింది.. కానీ ఈ బ్యూటీ అందానికి మాత్రం కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ.. అమ్మడి పనైపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలు
Actres
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2025 | 2:56 PM

Share

చాలా మంది హీరోయిన్స్ మోడలింగ్ నుంచే కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్స్ గా మారారు. ఈ అమ్మడు కూడా అలానే కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్ అవ్వకముందు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఈ అందాల భామ ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో యువతను ఆకట్టుకుంది. హిందీలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఒక స్టార్ హీరో సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది ఆమె.. కానీ తన తెలుగు డెబ్యూ మూవీ అనూహ్యంగా బోల్తా పడింది. ఈ అమ్మడి అందం, అభినయానికి మంచి పేరొచ్చినా సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో ఈ అందాల తార పని అయిపోయినట్టేనని చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు ,ఐదు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇలా టాలీవుడ్ లో బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేసిన ‘కింగ్ డమ్’లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నాని అనుకున్నారు. అయితే చివరకు ఆ ఆఫర్ భాగ్యశ్రీని వరించింది. ఈ సినిమా మొనీమద్యే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకెక్కిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోనూ భాగ్యశ్రీనే హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంతా’ లోనూ భాగ్యశ్రీనే కథానాయికగా నటిస్తుంది. అలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ ఈ క్రేజీ హీరోయిన్ ని లాక్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందీ ముద్దుగుమ్మ. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న బ్రహ్మా రాక్షస్ లోనూ ఈ ముద్దుగుమ్మ నటించనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 4 పాన్ ఇండియా సినిమాలతో బిజి బిజీగా ఉంది అమ్మడు. ఇక సోషల్ మీడియాలో భాగ్యశ్రీకి యమా క్రేజ్ ఉంది. ఆమె ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైభవ్ సూర్యవంశీకి పొంచి ఉన్న ముప్పు..ఉతప్ప వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి పొంచి ఉన్న ముప్పు..ఉతప్ప వార్నింగ్
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇవి కనిపిస్తే మీకు తిరుగుండదు..
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇవి కనిపిస్తే మీకు తిరుగుండదు..
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
10th అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
10th అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం
పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం
సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్
సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్
అన్నదానం చేస్తే గత జన్మ దోషాలు సైతం మటుమాయం...
అన్నదానం చేస్తే గత జన్మ దోషాలు సైతం మటుమాయం...
భూమిలో బంగారం కథ ముగిసిందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది..
భూమిలో బంగారం కథ ముగిసిందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది..
రాజుల కాలం నాటి బ్యూటీ సీక్రెట్.. ఈ పొడిని ఫేస్‌ ప్యాక్‌లా వాడితే
రాజుల కాలం నాటి బ్యూటీ సీక్రెట్.. ఈ పొడిని ఫేస్‌ ప్యాక్‌లా వాడితే
రేపట్నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు
రేపట్నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు