
హీరోలుగా ఎదగాలని, సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది కలలుకంటుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాల్లో రాణిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అలాగే నటన పరంగా తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు కొందరు. వారిలో చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్స్ , లేదా విలన్ రోల్స్ చేసి వచ్చిన వారే.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో కూడా అదే కోవలో వస్తాడు. ఒకప్పుడు హీరోల చేతిలో తన్నులు తిన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆతర్వాత విలన్ గా మారిపోయాడు. విలన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. విలన్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. అతను మరెవరో కాదు మ్యాచో మ్యాన్ గోపీచంద్. సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు గోపిచంద్. కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. తొలివలపు గోపీచంద్ మొదటి సినిమా.. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఆతర్వాత విలన్ గా మారి తేజ తెరకెక్కించిన జయం సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే విలన్ గా గోపిచంద్ కు మంచి పేరువచ్చింది. ఆతర్వాత నిజం సినిమా చేశాడు. ఈ సినిమాలో కూడా తన విలనిజంతో భయపెట్టాడు. ఇక వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమా హిట్ తర్వాత తిరిగి హీరోగా సినిమాలు చేశాడు గోపిచంద్. రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం ఇలా వరుసగా హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు గోపీచంద్. 2017లో వచ్చిన గౌతం నంద సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు గోపీచంద్.
ప్రశ్నలు & సమాదానాలు
ప్రశ్న : గోపిచంద్ తండ్రి ఎవరు.?
జవాబు : తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ
ప్రశ్న: గోపీచంద్ కొత్త సినిమా పేరు ఏంటి.?
జవాబు : భారతవర్ష
ప్రశ్న: గోపీచంద్ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు.?
జవాబు : రీతూ వర్మ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి