Tollywood: రూ.500లకు హోటల్లో హోస్ట్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఒక్క సినిమాకు 4 కోట్లు.. ఎవరో తెలుసా..?

|

May 26, 2024 | 8:12 AM

గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుని.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నటిగా మారింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కాలేజీ రోజుల్లోనే హోటల్లో ఈవెంట్ హోస్ట్‏గా పనిచేసిన అమ్మాయి..ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

Tollywood: రూ.500లకు హోటల్లో హోస్ట్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఒక్క సినిమాకు 4 కోట్లు.. ఎవరో తెలుసా..?
Actress
Follow us on

మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉన్నత చదువులు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసింది. కుటుంబానికి అండగా నిలబడేందుకు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఎంతో మంది చిన్నారులను అండగా నిలబడింది. టాప్ హీరోయిన్ గా దక్షిణాదిని ఏలేస్తున్న ఆ హీరోయిన్.. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుని.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నటిగా మారింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కాలేజీ రోజుల్లోనే హోటల్లో ఈవెంట్ హోస్ట్‏గా పనిచేసిన అమ్మాయి..ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. దాదాపు రూ.101 కోట్లకు యజమానిగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన ఆ హీరోయిన్ సమంత.

ఒకప్పుడు సామ్ మొదటి జీతం రూ.500. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది సమంత. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు నేపథ్యానికి చెందినవారు. తల్లి నినెట్ ప్రభు మలయాళీ కుటుంబానికి చెందినవారు. సమంత కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఉన్నత చదువుల కోసం తన తండ్రి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని.. దీంతో తన చదువును మధ్యలోనే ఆపేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన సామ్..ఆ తర్వాత మోడలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. చెన్నైలోని పలు షాపింగ్ మాల్స్ ప్రకటనలలో నటించింది సామ్. ఈ క్రమంలోనే చిత్రనిర్మాత రవి వర్మన్ సమంతలోని ఆసక్తిని గమనించి ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చారు. 2007లో రవి వర్మన్ దర్శకత్వం వహించిన మాస్కోయిన్ కావేరి మూవీతో సామ్ తెరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత 2010లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సామ్.. జెస్సీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో సామ్ నటనకు అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 11వ తరగతిలో ఉన్నప్పుడు ఓ హోటల్లో ఈవెంట్ కు హోస్ట్ గా పనిచేశానని తెలిపింది. ఎనిమిది గంటలు వర్క్ చేయగా.. తనకు జీతం రూ.500 ఇచ్చారని తెలిపింది. నివేదికల ప్రకారం ఇప్పుడు సమంత ఒక్క సినిమాకు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. మయోసైటిస్ కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతోనే అటు నిర్మాతగా పరిచయమవుతుంది సామ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.