Tollywood: 17 ఏళ్ల వయసులోనే శారీరక విమర్శలు.. సొంతంగా వందల కోట్ల ఆస్తులు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. ?

|

Aug 13, 2024 | 2:23 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నసెలబ్రెటీస్ ఒకప్పుడు అనేక విమర్శలు భరించినవారే. అలాంటి కోవకు చెందిన ఓ హీరోయిన్ ఇప్పుడు వందల కోట్లకు మాహారాణి. సినీ కెరీర్ ప్రారంభంలో నిర్మాతల నుండి ఆమె చాలా తిరస్కరణలను ఎదుర్కొంది. కెరీర్ తొలిదశలో చాలా నిరాశ, నిస్పృహలను చూసింది.

Tollywood: 17 ఏళ్ల వయసులోనే శారీరక విమర్శలు.. సొంతంగా వందల కోట్ల ఆస్తులు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. ?
Actress
Follow us on

సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నసెలబ్రెటీస్ ఒకప్పుడు అనేక విమర్శలు భరించినవారే. అలాంటి కోవకు చెందిన ఓ హీరోయిన్ ఇప్పుడు వందల కోట్లకు మాహారాణి. సినీ కెరీర్ ప్రారంభంలో నిర్మాతల నుండి ఆమె చాలా తిరస్కరణలను ఎదుర్కొంది. కెరీర్ తొలిదశలో చాలా నిరాశ, నిస్పృహలను చూసింది. అయినా పట్టు వదలలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ వ్యక్తిగత వివాదాస్పద విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. అలాగే కొన్ని నెలలపాటు ఆమె భర్త పలు ఆరోపణలతో జైలు జీవితం గడిపాడు. తనే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి. ఇటీవల తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’తో పంచుకుంది.

కెరీర్ ప్రారంభంలో ముదురు రంగులో సన్నగా ఉండడంతో అనేకసార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. “గ్రాడ్యుయేషన్ తర్వాత నేను మా నాన్నతో కలిసి పనిచేయాలనుకున్నాను. అందుకు కొత్తగా, ఇంకాస్త మెరుగ్గా ఏదైనా చేయాలనుకున్నాను. అయితే సరదాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనడంతో పరిస్థితులు మారిపోయాయి. ఒక ఫోటోగ్రాఫర్ నన్ను ఫోటో తీయడంతో సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా ఫ్యాషన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఆ తర్వాత నాకు మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నేను వ్యాపారంలో విఫలమయ్యాను. నేను నటించడం ప్రారంభించినప్పుడు నా వయస్సు 17 ఏళ్లు. నేను ప్రపంచాన్ని చూడలేదు, అలాగే జీవితాన్ని అర్థం చేసుకోలేదు.

హిందీ ఎలా మాట్లాడాలో తెలియక కెమెరా ముందు నిలబడ్డాను. కొన్ని సినిమాల తర్వాత నా కెరీర్ ముగిసే స్థాయికి చేరుకుంది. కారణం లేకుండా నన్ను తమ సినిమాల నుంచి తప్పించిన నిర్మాతలు కూడా ఉన్నారు. నేను బిగ్ బాస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌తో వివక్షకు గురైనట్లు గుర్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా వెనక్కు వేయాలని లేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు నేను నటించిన సినిమాలు హిట్టయ్యాయి. నా నటనను చూసి అభినందించారు. నేను చూపిన పట్టుదల, పోరాట పటిమ నాకు విజయాన్ని అందించాయి. నా జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఎన్నో భయానక క్షణాలు ఉన్నాయి. ఎన్నో విమర్శల తర్వాత పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్ను ఈ రోజు ఉన్న బలమైన స్వతంత్ర మహిళగా, నటిగా మార్చాయి ” అంటూ చెప్పుకొచ్చింది. శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి వియాన్, షమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో శిల్పా ఒకరు. 100 కోట్ల విలువైన బంగ్లాతో పాటు విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న శిల్పాశెట్టికి జెట్ విమానం కూడా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.