AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. శ్రీదేవిని మించిన క్రేజ్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

కేవలం మూడేళ్ల వయసులోనే వెండితెరపై బాలనటిగా సందడి చేసింది. ఆ తర్వాత 90వ దశకంలో కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. అప్పట్లో హీరోయిన్లను మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన ఒక చిన్న పొరపాటుతో ఆమె జీవితం తలకిందులైంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. శ్రీదేవిని మించిన క్రేజ్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
Urmila Matondkar
Rajitha Chanti
|

Updated on: May 11, 2026 | 11:43 AM

Share

బాలీవుడ్ తెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన అగ్ర తారలలో ఊర్మిళా మటోండ్కర్ ఒకరు. తన నటనతో, గ్లామర్‌తో దేశవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న ఈ సుందరి, కెరీర్ మంచి క్రేజ్ లో ఉన్న సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆమె ప్రయాణాన్ని మార్చేసింది. ఆ నిర్ణయం ఏమిటి, ఆమె కెరీర్ ఎలా దెబ్బతిన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాతో ఊర్మిళా మటోండ్కర్ దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన ‘సత్య’, ‘దౌడ్’, ‘మున్నాభాయ్ MBBS’ (ఒక పాటలో) వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా నిలిచింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా ఆమె తనదైన ముద్ర వేసింది. 20 ఏళ్ల వయసులోనే ఆమె ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

కెరీర్ పరంగా ఊర్మిళా అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే ఆమె ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతుంటారు. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆమె ఒకే తరహా సినిమాలను ఒప్పుకోవడం.. వచ్చిన అవకాశాలు వదిలేసుకోవడం వల్లే తన కెరీర్ దెబ్బతినిందని అంటుంటారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. ఒకే సినిమాకు సంవత్సరాలు కేటాయించడం సైతం మైనస్ అయ్యిందని అంటుంటారు. అదే సమయంలో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో, ఊర్మిళా కెరీర్ కూడా నెమ్మదించింది. ఇతర అగ్ర దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. నటిగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, కేవలం ఒకే రకమైన కథాంశాలకు పరిమితం కావడం వల్ల ప్రేక్షకులు ఆమెను కొత్తగా చూడలేకపోయారు. దీంతో గ్లామర్ పరంగా ఉన్న క్రేజ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అనుహ్యంగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది. దీంతో చాలా కాలంపాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఊర్మిళా తిరిగి సినిమాలలో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us