Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

ఒకప్పుడు సినీరంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్.. తక్కువ సమయంలోనే ఓ ఇమేజ్ సంపాదించుకుంది. కానీ ఒక్కరోజులోనే ఆమె కెరీర్ క్లోజ్ అయ్యింది. దీంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..
Yamuna

Updated on: Nov 24, 2025 | 10:12 PM

తెలుగు సినిమా ప్రపంచంలో చాలా మంది హీరోయిన్స్ ఓ వెలుగు వెలిగారు. ఒకప్పుడు అందం, అభినయంతో తమకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే సినీ హీరోయిన్లతోపాటు.. ఇప్పుడు బుల్లితెర తారలకు సైతం మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోయిన్స్ ఎప్పుడో ఒకసారి అడియన్స్ ముందుకు వస్తుంటారు. కానీ సీరియల్ బ్యూటీస్ అలా కాదు.. వారంతా రోజూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తుంటారు. ఒకప్పుడు హీరోయిన్లుగా వెలుగు వెలిగిన తారలు.. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు. ఆమని, రాశి, ఖుష్బూ, రాధిక వంటి హీరోయిన్స్ సీరియల్స్ లో నటించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం సినిమాల్లో నటించింది. ఇప్పుడు సీరియల్స్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. యమునా.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

దాదాపు 50కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు ప్రేమ. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో జన్మించిన ఆమె తరువాత తన కుటుంబంతో బెంగళూరుకు మకాం మార్చారు. ప్రేమ తమిళ సినిమా ద్వారా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1987లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన “మనథిల్ ఉత్తమ్ వేహ్లే” చిత్రంతో అరంగేట్రం చేసింది. దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినిమాలో అడుగుపెట్టినప్పటికీ, యమునా ఎక్కువగా తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. 1994లో, ఆమె శ్రీదేవి మరియు నాగార్జున చిత్రం “గోవింద గోవింద”లో కూడా నటించింది. తెలుగు, కన్నడలో కలిపి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గానే కాకుండా సహయ నటిగానూ కనిపించింది. అలాగే సీరియల్స్ సైతం చేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే జరిగిన ఒక సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

2011లో బెంగళూరులోని ఐటీసీ రాయల్ గార్డెనియా 5-స్టార్ హోటల్‌లో నటి యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడిందన్న వార్తలు అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ కేసులో విటుడిగా సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యింది. సూటిపోటీ మాటలు భరించలేక మీడియాకు దూరంగా ఉండిపోయింది. చాలా కాలంపాటు సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉన్న యమునా.. ఆ తర్వాత నెమ్మదిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని తెలిపింది. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు తనను వ్యభిచార కేసులో ఇరికించారని, దీనివల్ల కలిగిన మానసిక సమస్యల కారణంగా తాను చాలాసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని, కానీ తరువాత తన పిల్లల కోసమే బతుకుతున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణ కారణంగా దాదాపు 4 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న నటి యమున, కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టీవీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..