
న్యాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న, హిట్ 3 చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలను అందుకున్న నాని.. ఇప్పుడు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇదెలా ఉంటే.. నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ జెర్సీ. 2019లో వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో హిట్టైందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ సినిమా 2021లో 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. ఈ చిత్రంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జోడి సినీప్రియులను ఆకట్టుకుంటుంది. కానీ మీకు తెలుసా.. ? ఈ చిత్రానికి ఆమె ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
జెర్సీ సినిమాలో నాని భార్యగా, ఓ బాబుకు తల్లిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది శ్రద్ధా శ్రీనాథ్. చాలా హుందాగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఇలాంటి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రద్ధాకు అవకాశాలు వచ్చినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ రెబా మోనికా జాన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆ అమ్మడు అదే సమయంలో తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుండడంతో ఈ చిత్రానికి నో చెప్పిందట.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ అవకాశాన్ని మిస్సైంది రెబా. ఆ తర్వాత ఆమె స్థానంలోకి వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాతో తెలుగులో విజయాన్ని అందుకుంది రెబా మోనికా జాన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..