AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : మహేష్ బాబు తల్లిగా.. పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్..

సాధారణంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టా్ర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మెయిన్ లీడ్ రోల్ పోషించిన తారలు.. ఇప్పుడు తల్లిగా, అత్తగా, అక్కగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ అప్పట్లో మహేష్ బాబు తల్లిగా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : మహేష్ బాబు తల్లిగా.. పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్..
Pawan Kalyan, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2026 | 4:59 PM

Share

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కథానాయికలుగా దూసుకుపోయిన తారలు.. ఇప్పుడు సహయ నటిగా మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలకు తల్లిగా, అత్తగా, అక్కగా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో గ్లామరస్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పవన్ కళ్యాణ్ భార్యగా, మహేష్ బాబుకు తల్లిగా కీలకపాత్రలు పోషించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అమీషా పటేల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తార.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఆమెకు కుర్రాళ్ల ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా స్క్రీన్ పై కనిపించిందంటే చాలు థియేటర్లలో విజిల్స్ తో మారుమోగేవి.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో అమాయకమైన అమ్మాయిగా.. ప్రకాష్ రాజ్ చెల్లిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఈ సినిమాలో సరయు పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో చివరగా పవన్ ను పెళ్లి చేసుకుని భార్యగా కనిపించింది. ఆ తర్వాత నాలుగేళ్ల వరకు మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లపాటు తెలుగులో గ్యాప్ తీసుకుని ఈ అమ్మడు.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన నాని సినిమాలో కథానాయికగా నటించింది.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

ఇందులో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో సీనియర్ మహేష్ బాబు ప్రియురాలిగా, భార్యగా నటించింది. అలాగే మహేష్ బాబు తనయుడికి తల్లిగా కనిపించింది. అలా మహేష్ బాబు తల్లిగా, పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించింది అమీషా. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు గదర్ 2 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ గురించి చెప్పక్కర్లేదు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

అమీషా పటేల్ ఇన్ స్టా పోస్ట్..

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

Follow Us