‘జై భీమ్’ సినిమా ఓటీటీ వేదికగా రిలీజై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థీమ్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కుతున్నాయి. సూర్య ఎప్పట్లానే తన పాత్రకు ప్రాణం పోశాడు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర సినతల్లి. యస్.. ఈ పాత్ర సినిమా చూసిన ప్రతి ఒక్కరిని చాలాకాలం వెంటాడుతుంది. వారి మనసుల్లో ఏదో తెలియని జాలిని, బాధను మిగులుస్తుంది. ఈ పాత్ర వేసిన అమ్మాయి పేరు.. లిజోమోల్ జోస్. అద్భుమైన నటనతో ఒక్కసారిగా ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది ఈ మలయాళీ పిల్ల. సినిమా చూసినవారు ఈమె నటనను పొగడాల్సిందే. అంతగా పాత్రలో లీనమైంది. సూర్య లాంటి స్టార్ హీరో పక్కన ఉన్నప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా సినతల్లిగా ఆమె నటించిన తీరు అద్భుతం. ఈమె ఇటీవల సిద్దార్థ్ హీరోగా నటించిన ఒరేయ్ బామ్మర్ది సినిమాలో నటించినప్పటికీ.. పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ ‘జై భీమ్’లో ‘సినతల్లి’ పాత్రతో ఆమె సౌత్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది.
కేరళలో 1992లో జన్మించింది లిజోమోల్ జోస్. ఈమెది మధ్యతరగతి కుటుంబం. ‘అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన లిజోమోల్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్’లో మాస్టర్స్ చదివింది. కొన్ని రోజుల పాటూ ఓ టీవీ ఛానల్‌లో జాబ్ చేసింది. ఫాహద్ ఫాజిల్ నటించిన ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాతో ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమెది పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాదు. ఆ తర్వాత ‘రిత్విక్ రోషన్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘హనీ బీ 2.5’, ‘స్ట్రీట్‌లైట్స్’, ‘ప్రేమసూత్రం’, ‘వత్తకోరు కాన్ముకన్’ వంటి వరుస సినిమాలతో ఈమె హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. ఇక తమిళంలో ‘శివప్పు మంజల్ పచ్చాయ్’ ( తెలుగులో ఒరేయ్ బామ్మర్ది) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘శివప్పు’లో లిజో నటనను చూసిన డైరెక్టర్ జ్ఞానవేల్ ‘జై భీమ్’లో సినతల్లి పాత్రకు ఆమెను తీసుకున్నారు. నటుడు అరుణ్ ఆంటోనీని లిజోమోల్ ఈ మధ్యే పెళ్లిచేసుకుంది.
Also Read: పోలీసులకు కొత్త పవర్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇకపై ఆ బాధ్యతలు వారికే.. !